calender_icon.png 29 October, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

29-10-2025 01:51:33 PM

ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

కాగజ్ నగర్,(విజయక్రాంతి): మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు.బుధవారం కోసిని డ్యాంలో చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మత్స్య శాఖ ద్వారా అన్ని చెరువుల్లో, డ్యాముల్లో చేప పిల్లల విడుదల చేస్తామని పేర్కొన్నారు. మత్స్యకారులకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని తెలిపారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఉపాధిలో రాణించాలన్నారు.కోసిని డ్యామ్ ని పర్యాటక స్థలంగా మార్చడానికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామని తెలిపారు.అనంతరం గ్రామస్తులు పలు సమస్యలు ఎమ్మెల్యే కీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉజ్వల్ కుమార్, జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ సాంబశివ రావు, ఆర్ డబ్లూఎస్ ఈ ఈ సిద్ధక్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, మత్స్య శాఖ సంఘం అధ్యక్షులు బాబురావు, పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ, మండల అధ్యక్షులు పుల్ల అశోక్, మాజీ సర్పంచ్ ధోతుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ తిరుపతి, గౌత్రే వెంకటేష్, రావుల నరేష్, యలమంచిలి శ్రీనివాస్ రావు, బాబురావు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.