calender_icon.png 29 October, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి

29-10-2025 01:29:45 PM

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్,  నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి,  సిద్దిపేట,  ఉమ్మడి వరంగల్,  యాదాద్రి భువనగిరి,  మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా మంత్రి పొంగులేటి ఉండాలని ఆదేశించారు. 

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఆర్&బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పోలీసులతో పర్యవేక్షించాలని, స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని  అందుబాటులో ఉంచుకోవాలని  సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పొంగులేటి సూచించారు