ఐదు రోజులు వర్షాలు
26-06-2024 01:25 AM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లా ల్లో ఉరుములు, మెరుపులు, ఈదు రు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.






