11 August, 2026 | 5:37 PM

Breaking News

ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా మల్యాల అంజయ్య నియామకం   •   దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో   •  

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు జలసమాధి

07-12-2024 09:13 AM

భువనగిరియాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. మృతులు హైదరాబాద్‌లోని హయత్ నగర్ వాసులు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. చెరువులోంచి ఐదుగురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. అయితే వారిలో మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి భూదాన్‌ పోచంపల్లికి వెళ్తున్న వీరు ఘటనా సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులే. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.