11 April, 2026 | 12:04 PM

Breaking News

మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •  

ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి: ఐదుగురు మృతి

25-02-2025 10:09 AM

అమరావతి: మహాశివరాత్రి ఉత్సవాల కోసం మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లాలోని తలకోనలో ఉన్న శివుని ఆలయానికి శేషాచలం అడవి గుండా వెళుతుండగా ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఐదుగురు భక్తులు(Devotees) మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన ఓబులవారిపెల్లే మండలం గుండాలకోన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు అరుస్తూ ఏనుగులను భయపెట్టేందుకు ప్రయత్నించారని పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఏనుగులు కోపంతో వారిని చుట్టుముట్టి దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు.

కొందరు భక్తులు ప్రాణాల కోసం పరుగులు తీశారు కానీ ఏనుగులు కొందరిని తొక్కడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన భక్తులు రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.