23 May, 2026 | 3:12 PM

ఐదుగురు జూదరుల అరెస్ట్

10-09-2025 10:30 PM

ఇబ్రహీంపట్నం: గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్ఓటి పోలీసులు(SOT Police) దాడులు నిర్వహించారు. ఈ ఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఎలిమినేడు గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ఐదుగురు జూదరులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.55 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.