వీరవనిత చాకలి ఐలమ్మ
మంగపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల రజక సంఘం అధ్యర్యంలో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు నూతలకంటి రాజు చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... నిజాం రజాకార్లతో భూమి కోసం బుక్తి కోసం తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాడిన వీరవనీత అని చిట్యాల ఐలమ్మను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు పుణ్యం నాగలక్ష్మి గ్రామ శాఖ అధ్యక్షులు తాటి రమణ గట్టికొప్పుల ఉపేందర్ పుణ్యం వెంకటేశ్వర్లు వేల్పుల రమేష్ సురేష్ నూతులకంటి రమేష్ నరేష్ మహేష్ లోంక రాజు చల్మయ్య రాచకొండ గణేష్ పుణ్యం సాయి కొండపర్తి నగేష్ నూతులకంటి రాధికా అరుణ కొండపర్తి రమాదేవి. పర్వతాల పుషమ్మ రాచకొండ భరతమ్మ పాల్గొన్నారు.






