10-09-2025 10:28:58 PM
హుజూర్ నగర్ మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్..
హుజూర్‌నగర్: తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ చూపిన తెగువ పోరాట స్పూర్తి నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని హుజూర్ నగర్ మాజీ ఎంపీపీ, రాష్ట్ర రజక సంఘం నాయకులు గూడెపు శ్రీనివాస్ అన్నారు. గురువారం చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఐలమ్మ పోరాట స్పూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి నాగేశ్వరరావు, ఆదూరి కిషోర్ రెడ్డి, దుగ్గి వర్మ, గూడెపు నాగలింగం, మీసాల కిరణ్, ఉదారి యాదగిరి, దగ్గుపాటి బాబురావు, దుగ్గి నరసింహరావు, కిస్టపాటి సైదిరెడ్డి, ముషం సత్యనారాయణ, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.