29 May, 2026 | 9:03 PM

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర ధరలపై నిరసన

29-05-2026 01:22 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర ధరలకు నిరసనగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన చేపట్టారు. శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగా నందిరామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచేలా ప్రభుత్వం పాలిస్తుందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.