calender_icon.png 10 October, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాండ్ మ్యుటేషన్‌కు 5 లక్షలు

10-10-2025 01:33:15 AM

రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ చిట్యాల ఎమ్మార్వో

చిట్యాల, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ కృష్ణానాయక్.. ల్యాండ్ మ్యుటేషన్‌కు ఓ రైతు నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు.

చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామానికి చెందిన 172 సర్వేనంబర్ నందు ల్యాండ్  ముటేషన్ చేయడానికి, అదే గ్రామానికి చెందిన 167 సర్వే నంబర్‌లో ఇన్స్‌ఫెక్షన్ రిపోర్ట్ ఇవ్వడానికి రైతు నుంచి తహసీల్దార్ కృ ష్ణానాయక్ రూ.పది లక్షలు లంచం డిమాండ్ చేశాడు.

రూ.ఐదు లక్షలకు అంగీకరిం చి, ముందుగా రూ.రెండు లక్షలు రైతు ఇచ్చాడు. మిగిలిన మూడు లక్షల్లో రూ.రెం డు లక్షలు గురువారం ప్రైవే ట్ నెట్ ఆపరేటర్ రమేష్ ద్వా రా తీసుకుటుండగా ఎమ్మా ర్వో కృష్ణనాయక్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.