10-10-2025 01:34:04 AM
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాం తి) : తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తా రు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జయశంకర్ భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గి రి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, వనసర్తి, జోగులాం బ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.