25-12-2025 01:38:32 PM
చిట్యాల,(విజయక్రాంతి): భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పాయ్(Atal Bihari Vajpayee) జయంతి వేడుకలను చిట్యాల పట్టణ కేంద్రం లో గురువారం బీజేపి నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రం లోని శ్రీ కనకదుర్గదేవి గుడి వద్ద భారత మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బీహారి వాజ్ పాయ్ జయంతి సందర్బంగా బిజెపి నాయకులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనoగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీనివాస్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, పల్లె వెంకన్న, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీనివాస్, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి జయరపు రామ కృష్ణ, గంజి గోవర్ధన్, ఈడుదల మల్లేష్, జోగు శేఖర్, పాల రవి వర్మ, పట్టణ కార్యదర్శి, కన్నె బోయన మురళి కృష్ణ, దామరోజు నాగరాజు, కన్నీబోయన హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.