calender_icon.png 25 December, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన క్రిస్మస్ పండుగ వేడుకలు

25-12-2025 01:36:16 PM

క్రిస్మస్ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల బెల్లంపల్లిలో క్రిస్మస్(Christmas celebrations) పర్వదిన పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. సోమగూడెం కల్వరి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కల్వరి చర్చిలో మంత్రి వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని ఆయా ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదరులు సామూహిక ప్రార్థన చేశారు. ఆయా ప్రార్థనా మందిరాలకు క్రైస్తవులు అర్థం రాత్రి చేరుకున్నారు. తెల్లవారుజాము వరకు సామూహిక ప్రార్థనలు జరిపారు. క్రిస్మస్ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు పి. రఘునాథరెడ్డి, కల్వరి చర్చి ఫాదర్ ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ నాయకులు రామచందర్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.