calender_icon.png 25 December, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో వలస కూలీ మృతి

25-12-2025 01:34:31 PM

వాంకిడి,(విజయక్రాంతి): ఉపాధి కోసం పక్క రాష్ట్రం నుంచి వలస కూలీ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన వాంకిడి మండలంలో(Wankidi Mandal) చోటుచేసుకుంది. మహారాష్ట్ర లోని రాజుర కోనత్‌పూర్ గ్రామానికి చెందిన గౌరవ్ తులసీరాం నికోడే (22) బుధవారం భవన నిర్మాణ పనుల నిమిత్తం వాంకిడి మండలానికి వచ్చాడు. ఈ క్రమంలో గోయగాం గ్రామానికి చెందిన మాడావి వాసుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులు నిర్వహిస్తుండగా సమీపంలోని విద్యుత్ తీగలు ఇనుప పైపును తాకడంతో గౌరవ్‌కు విద్యుత్ షాక్ తగిలింది.

తక్షణమే అతడిని వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆసిఫాబాద్‌కు రిఫర్ చేయడంతో హుటాహుటిన తరలించారు. క్షతగాత్రుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందకపోవడమే గౌరవ్ తులసీరాం మృతికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. వాంకిడి ప్రభుత్వ దవాఖానాకు తీసుకువచ్చిన అనంతరం సుమారు గంటపాటు ఎవరూ పట్టించుకోలేదని, వైద్యులు కూడా అందుబాటులో లేరని వారు వాపోయారు.