25-12-2025 01:31:28 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా,కాల్వపల్లి తండా చర్చిలో క్రిస్మస్ వేడుకలు పాస్టర్ నతానీయల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొత్త దొనబండ తండా గ్రామ సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చర్చి పాస్టర్ పూష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు.
సర్పంచ్ కెక్ కట్ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా సోదరి సోదరీమణులకు క్రీస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అని,ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని,ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.అనంతరం చర్చి డెవలప్మెంట్ కొరకు సర్పంచ్ అరుణా దేశ్ పాండు,10,000 వేల,సక్రు నాయక్ 5000వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లక్ష్మి భరత్ నాయక్,టీకా,హుస్సేన్,కృష్ణ నాయక్,నరసింహ,శ్రీను,మోతి, శాంతి తదితరులు పాల్గొన్నారు.