16 March, 2026 | 3:08 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవస్థలో లోపాలు

22-04-2025 12:14 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయని, కొన్ని విషయాల్లో ఈసీ రాజీపడుతున్నట్లు కనిపిస్తున్నదని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో సోమవారం ఎన్‌ఆర్‌ఐలతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఈసీ కొన్ని విషయాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నదని ఆరోపించారు. అందుకు ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. అక్కడి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మధ్య ఓట్లు పోల్ అయ్యాయని, ఈ విషయాన్ని స్వయంగా ఈసీనే వెల్లడించిందని గుర్తుచేశారు. కేవలం రెండు గంటల్లో అంత పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదుకావడం సాధారణ విషయం కాదని, ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి కనీసం మూడు నిమిషాల సమయం పడుతుందని స్పష్టం చేశారు. మరి అతి తక్కువ వ్యవధిలో లక్షలాది మంది ఓటు వేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తాము ఓటింగ్‌కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ చూపించాలని ఈసీని కోరామని, కానీ.. తమ విజ్ఞాపనను ఈసీ తిరస్కరించిందని వాపోయారు.