6 July, 2026 | 3:24 AM

జూరాలకు వరద

11-06-2024 01:39 PM

వనపర్తి (విజయక్రాంతి ) : జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా వరద ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 7,211 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల మేర నిల్వ ఉందని అధికారులు తెలిపారు.