15 April, 2026 | 11:01 AM

పూల చొక్కా

09-03-2026 01:46 AM

కలగంటున్న

ఆకాశంలోని నక్షత్రాలన్నీ 

అచ్చొత్తు కున్నట్టు మిలమిల మెరిసిపోయే

అంగీ.. ఆహార్యాన్ని ఆస్వాదిస్తోంది

చేతులు పైకి మడత బెట్టి పూల 

చొక్కా సింగారాన్ని

సిత్రించుకున్న రంగుల దృశ్యం

కళ్ళల్లో కదులుతుండగానే మంచం మీదుంచి 

డబీల్మని కిందపడ్డ దేహం... 

అప్పుడప్పుడు నిజాలు

ఎలిసి పోయిన  సప్తవర్ణాలే  ఇంకేముంది

పూలు రాలిన చెట్టులా

దిగాలు పడి పోయింది మనసు..!

 డా.కటుకోఝ్వల రమేష్