8 March, 2026 | 4:58 AM

రాహుల్ ప్రధాని అవుతారా!

08-03-2026 12:04 AM

రాహుల్  ప్రధాని కావాలంటే రాహుల్ రాజకీయంగా మరింత చాలా దూరం ప్రయాణించాలి.  ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాహుల్ ప్రతిపక్ష నేత గానే కాకుండా, ప్రజానేతగా ఎదగాలి. ప్రజాస్వామిక దేశాలలో ప్రజల పక్షాన పని చేసే వారే ఎప్పటికైనా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భారత రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇ టీవల తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబి రం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలోనే రాహుల్ ప్రధానమంత్రి కావాలని, అందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

రాహుల్‌ని ప్రధానమంత్రిగా చూడా లనే అంశాన్ని 2009లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారిగా తెరపైకి తెచ్చారు. గడిచిన దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వరుస ఓటములను ఎదుర్కోవటంతో రాహుల్‌గాంధీ ప్రధాని అనే ప్రస్తావన దా దాపు మరుగున పడిపోయింది. కానీ, 18వ లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడటం,

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దం తర్వాత ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు దక్కటం, రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కటంతో మ రొకసారి దేశ రాజకీయాల్లో రాహుల్ ప్రధా ని కావాలనే నినాదం కాంగ్రెస్ శ్రేణులు మరొకసారి తెర పైకి తెస్తున్నాయి. గాంధీ కు టుంబ వారసుడిగా జాతీయ కాంగ్రెస్ అధ్య క్ష బాధ్యతల నుంచి తప్పుకున్నా, భారత్ జో డో యాత్రతో తన ప్రాబల్యాన్ని మార్చుకు న్న రాహుల్ గాంధీ, మోదీలా ప్రధాని కా గ ల అర్హత ఉన్న వ్యక్తిగా దాదాపు 28 శాతం ప్రజలు ఆమోదిస్తున్నారని సర్వే సంస్థలు చెపుతున్నాయి.

రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధానమంత్రి కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా సంఖ్యాక శాస్త్రం అనుకూలించాలి. పార్లమెంట్‌లో పార్టీ బలం పెరగాలి. ప్రస్తుతం లోక్ సభ లో కాంగ్రెస్ పార్టీ బలం కేవలం 99+1 మాత్రమే. 2004  కాంగ్రెస్ పార్టీ 145, 206 లోక్‌సభా స్థానాల్లో విజ యం సాధించి మిత్రపక్షాల బలంతో యూపీఏ1, యూపీఏ 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది.

గత రెండు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ లో ప్రతిపక్ష పార్టీ హోదా పొందే స్థాయిలో లోక్ సభ స్థానాలలో విజయం సాధించలేదు కానీ 18వ లోక్ సభ ఎన్నికలలో మాత్రం 100 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి తన బలం పెంచుకోగలిగింది. కానీ, భవిష్యత్తులోనైనా (లోక్‌సభా స్థానాలు పెరగక పోతే) కా ంగ్రెస్ పార్టీ 150కి పైగా లోక్ సభా స్థానాల లో విజయం సాధించగలిగితేనే రాహుల్ గాంధీ ప్రధాని కాగలుగుతారు.

ఇండియా కూటమి అధికారంలోకి రాగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ముఖాముఖి పోటీ పడుతున్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, అస్సాం, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో తన బలం పెంచుకోలేకపోతే కాం గ్రెస్ అధికారంలోకి రావటం, రాహుల్ ప్ర ధాని కావటం కలగానే మిగిలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటమే కాదు..

123 లోక్‌సభా స్థానాలు ఉన్న ఈ రా ష్ట్రాల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 29 లోక్‌సభా స్థానాల్లో మాత్ర మే విజయం సాధించింది. భారత్ జోడో యాత్ర రాహుల్ ఇమేజ్‌ని పరిణితిని పెం చినా కాంగ్రెస్‌కి కామరాజ్ ఫార్ములా లాంటి ఫార్ములా కావాలి అలాగే ప్రజలే కాంగ్రెస్ ని గెలిపించాలనే ఆలోచన నుండి కాంగ్రెస్ పా ర్టీ నాయకత్వం బయట పడినప్పుడే రాహు ల్ గాంధీ ప్రధానమంత్రి కాగలుగుతారు.

భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకం 

1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు అన్ని మైనార్టీ లేదా భాగస్వామ్య ప్రభుత్వాలే కాబట్టి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవు కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కా వాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు కూ డా కీలకంగా మారుతుంది.

కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మొత్తం బలం లోక్ సభ లో 234 దీనిలో భాగస్వామ్య పార్టీల బలం 134 అలాగే లోక్ సభ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత అతి పెద్ద పార్టీలైన సమాజ్ వాది పార్టీ (37) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (28) మరియు డీఎంకే (22) బలం 87.. కాబట్టి ఈ పార్టీలు 19 లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ బలం కాపాడుకోగలిగితేనే రాహుల్ ప్రధాని కావడానికి అవకాశాలు మెరుగుపడతాయి.

బీజేపీ బలహీనపడాలి 

గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో 2014 లోనూ 2019 లోనూ భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయాలను నమో దు చేసుకుంది. కానీ, 400 లోక్ సభా స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 240 లోక్ సభా స్థానాలకే పరిమితమై మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలలో బీజేపీ ఆశించిన స్థాయిలో లోక్ సభా స్థానాలలో విజయం సాధించకపోవ టం వలన బీజేపీ ఒక విధంగా ఓడి గెలిచిందనే చెప్పాలి.

2029 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే బలహీనత ఇలాగే కొనసాగితే, అది కాంగ్రెస్‌కి అనుకూలంగా మారి రాహుల్‌గాంధీ ప్రధాని కావటానికి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత రాబోయే రాజకీయ పరిణామాలను గ్రహించిన భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టిన దిద్దుబాటు చర్యల్లో భాగంగా లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని గెలవటం రాజకీయ వ్యూహాల్లో భాగమే. భవిష్యత్తులో బీజేపీ రాజకీయంగా బలహీన పడకుండా రాహుల్‌కు పీఠం ఎక్కడం అసాధ్యం. 

గాంధీ వారసత్వం సరిపోదు

గాంధీ కుటుంబ వారసత్వమే భారత దేశ ప్రధానమంత్రి హోదాకి సమానమనే అభిప్రాయం చాలామంది పాత తరం ప్రజలలో ఉంది, అందుకే అనేక సందర్భాలలో మోడీ వారసత్వ రాజకీయాలను బలంగా వ్యతిరేకిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా భారత దేశ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా జాతీయవాద హిందుత్వం, కులం, డబ్బు లాంటి  అంశా లు రాజకీయాలలో ప్రధాన భూమిక పోషిస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ లాంటి వారు ప్రధానమంత్రి కావటానికి ఒక్క గాం ధీ వారసత్వ కుటుంబ నేపథ్యం సరిపోదు అనే విషయాన్ని 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గ్రహించడమే కాదు ఆ భావన నుండి బయటపడాలి.

కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఆరుగురు ప్రధాన మం త్రులను అందిస్తే ఒక్క గాంధీ కుటుంబం నుండే ముగ్గురు ప్రధాన మంత్రులు అ య్యారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం 146 కోట్ల జనాభా గల భారత్ వంటి దేశంలో అత్యున్నతమైన ప్రధాని వం టి హోదాకి చేరుకోవటానికి అనేక సవాళ్లను అధిగమించాలి. రాహుల్ గాంధీకి ప్రస్తుతం దక్కిన ప్రతిపక్ష నాయకుడి హోదాని అందు కు తొలిమెట్టుగా వాడుకోవాలి. లోక్‌సభ లాంటి అత్యున్నత సభలో మరింత పరిణితి కలిగిన నాయకుడిగా వ్యవహరించాలి.

పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. బలమైన మోదీ, బీజేపీ దాని నాయకత్వాన్ని దాటి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే రాహుల్ రాజకీయంగా మరింత చాలా దూరం ప్రయాణించాలి.  రాహుల్ ప్రతిపక్ష నేత గానే కాకుండా, ప్రజానేతగా ఎదగాలి. ప్రజాస్వామిక దేశాలలో ప్రజల పక్షాన పని చేసే వారే ఎప్పటికైనా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భారత రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం.

 సెల్: 98854 65877