calender_icon.png 20 February, 2026 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అంగన్వాడీ’పై ఫోకస్!

20-02-2026 12:00:00 AM

  1. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  2. సర్పంచులకు పర్యవేక్షణ బాధ్యతలు
  3.   11 మంది సభ్యులతో కమిటీ ?
  4. అక్రమాలు అరికట్టేందుకు చర్యలు 

సంగారెడ్డి, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను బ లోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను స ర్పంచులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహా రం అందనుంది. అలాగే సిబ్బంది సమయపాలన మెరుగవడంతో పాటు అక్రమాలకు చెక్ పడనుంది.

11 మందితో కమిటీ..

అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు సం బంధించి 11 మందితో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి సర్పంచ్ చైర్పర్సన్ గా, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఏఎన్‌ఎం, ప్రభుత్వ పాఠశాల ఉ పాధ్యాయుడు, రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు.

అక్రమాలకు చెక్..

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహా రం అందిస్తున్నారు. అయితే కొన్ని కేంద్రా ల్లో టీచర్లు, ఆయాలు సరుకులను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సమయపాలన పాటించకపోవడం, కొంతమంది కేంద్రానికి రాకపోవడం, హాజరు వేసుకొని ఇంటిబాట పట్టడం, సొంత పను ల్లో బిజీగా ఉండడంతో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

చిన్నారులకు ఆటపాటలతో విద్య అందించాల్సి ఉండగా, వారి ని కూర్చోబెట్టి వెళ్లిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కేంద్రాలకు చి న్నారులను తీసుకొచ్చే బాధ్యత ఉన్నప్పటికీ విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలా గే చిన్నారులకు ఇచ్చే మురుకులు, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు.

ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలతో పాటు మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు భోజనం పెట్టాలి. ఉడికించిన గుడ్డు ఇవ్వాలి. అ యితే కొంత మంది టీచర్లు సరుకులను లబ్ధిదారుల ఇం టికి ఇవ్వడంతో వాటిని ఇంటిల్లిపాది వినియోగిస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింత లకు పౌష్టికాహారం అందడం లేదు. అయితే ఈ కమిటీతోఇలాంటివాటికి చెక్ పడనుంది.

పర్యవేక్షణతో గాడిన పడేనా...

సర్పంచులకుకు అంగన్వాడీ కేంద్రాల ప ర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో కేం ద్రాలు గాడిన పడతాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయా కేంద్రాలను ఐసీడీ ఎస్ పీడీతో పాటు సీడీపీవోలు, సూపర్వైజ ర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరిలో చా లా మంది కార్యాలయానికే పరిమితం కావ డం, చుట్టంచూపుగా వచ్చి వెళ్లడమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ఆయా కేం ద్రాల్లో చిన్నారులు ఉండకపోయినా సరుకులను లబ్దిదారులకు ఇచ్చినట్లుగా కొంత మంది నమోదు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సర్పంచ్ తో పాటు కమిటీ స భ్యులు పర్యవేక్షించనుండడంతో పూర్వ ప్రా థ మిక విద్య బలోపేతం కానుంది. ఇక్కడ చదివిన పిల్లలను సర్కారు బడిలో చేర్పించడంతో అందులోనూ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.