calender_icon.png 20 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యిండు?

20-02-2026 12:00:00 AM

  1. అలా చెప్పుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులకు సిగ్గుండాలి 

మహాత్మాగాంధీ మాత్రమే జాతిపిత

మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

మహబూబాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ‘కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యిండు..? బీఆర్‌ఎస్ నాయకులు  కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. జాతిపిత మ రి జనంలోకి ఎందుకు రావట్లేదు..? మహాత్మా గాంధీ మాత్రమే జాతిపిత’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో షాదీముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు అధికారం కుటుంబ హక్కుగా వ్యవహరిస్తున్నారన్నారు. విపరీతమైన ధోరణితో నీచమైన విమర్శలు చేస్తున్నారు. ప్రజలు వాళ్ల విమర్శలను ఓటు రూపంలో తిప్పికొట్టారు. ప్రజలు వాళ్ల విమర్శలను పట్టించుకోవడం లేదు అనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నా రు.

జాతిపిత ఒక్కరే ఉన్నారు ఆయనే మహా త్మాగాంధీ అని, జాతిపిత అని చెప్పుకోవడాని కి సిగ్గు ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారన్నారు. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలన్నా రు. కల్వకుంట్ల కుటుంబంలోని ప్రతీ ఒక్కరు కేసులలో ఇరుక్కున్నారని, వాళ్ల మీద కేసులు అయితే తెలంగాణను అవమానిస్తున్నారని అంటున్నారని,

తెలంగాణ మీ అయ్యా సొత్తా అంటూ, ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తారని ప్ర శ్నించారు. మీ అహంకారం, మాటతీరులో మార్పు రాలేదు. కాబట్టే ప్రజలు మీకు ఓటు వేయడం లేదన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, కొత్త సర్పంచులు, కౌన్సిలర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.