మున్సిపాలిటీ లో ఆక్రమణలపై దృష్టి పెట్టండి
మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలపై దృష్టి సారించాలని తొమ్మిదవ వార్డు బిజెపి నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ మంగళ వారం డిమాండ్ చేశారు. తొమ్మిదో వార్డు జెండా వాడలో డ్రైనేజీపై కాంపౌండ్ వాల్ నిర్మించారని, డ్రైనేజీపై ఉన్న కాంపౌండ్ వాల్ ను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ లో భాగంగా ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ కనబడలేదా..? ఇప్పటి వరకు పది, పదిహేను సార్లు మంత్రి ఈ వార్డులో తిరిగినా కనిపించకపోతే సామాన్యుల సమస్యలు ఎలా కనబడుతాయి అని విమర్శించారు. గత ప్రభుత్వంలో వెంచర్ వేస్తే అదే కంటిన్యూగా కొనసాగిస్తున్నారనీ, కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండతో ప్రతిపక్షంలో పనిచేస్తున్న మాజీ నాయకులు చెలరేగిపోతున్నారన్నారు.






