calender_icon.png 1 July, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువత ఉద్యోగ కల్పనపై దృష్టి సారించాలి

30-06-2025 10:02:53 PM

జిల్లా కలెక్టర్ హైమావతి..

సిద్దిపేట కలెక్టరేట్: పెండింగ్ లో ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాలు వెంటనే ఆమోదించాలని జిల్లా కలెక్టర్ హైమావతి(District Collector Hymavathi) సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయములో నిర్వహించిన పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీలో టిజి - ఐపాస్, టి-ప్రైడ్ దరఖాస్తులపైన చర్చించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ప్రైవేట్ పరిశ్రమల రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో "డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ - తెలంగాణ(DEET)" గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పారిశ్రామిక జీఎం గణేష్ రామ్, డీటీ సీపీఓ వందనం, ఎల్‌డిఎం హరిబాబు, ఇతర టీజీ-ఐపాస్ అధికారులు పాల్గొన్నారు.