calender_icon.png 1 July, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యుత్తమ సేవలతోనే ప్రజల్లో గుర్తింపు

30-06-2025 10:00:04 PM

ఉద్యోగ విరమణ కాదు ఆరోగ్య రిత్య విరమణ..

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తప్పదు..

మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం అదృష్టంగా భావించాలి..

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు (విజయక్రాంతి): మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలని, ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ కాదని ఆరోగ్యరీత్యా విరమణని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.(District Collector Divakara T.S.) అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చిట్టి రెడ్డి రవీందర్ రెడ్డి, ఏటూరునాగారం ఎంపీడీవో రాజ్యలక్ష్మి, వాజేడు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణలు  పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వీడ్కోలు సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావులతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ... 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనంతరం కలెక్టర్ స్థాయి నుండి అటెండర్ స్థాయి వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ పొందాల్సి ఉంటుందని, పదవీ విరమణ పొందిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గతంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు కొంతమేరకే లబ్ది పొందే అవకాశం ఉండేదని  నేడు పలు రకాలుగా లబ్ధి పొందే అవకాశం లభించిందని అన్నారు.  గ్రామస్థాయి నుండి జిల్లా అధికారి వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల మన్ననలు పొందడం గొప్ప విషయమని, అవే ప్రభుత్వ ఉద్యోగికి గౌరవం సంతృప్తి ఇస్తుందని అన్నారు.

అత్యుత్తమ సేవలతోనే ప్రజల్లో గుర్తింపు వస్తుందని అన్నారు. పదవి విరమణ పొందిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నిజమైన జీవితం ప్రారంభమవుతుందని, ఆరోగ్యం ఐశ్వర్యం జీవితంలో ముఖ్యమైన అని అన్నారు. క్రింది స్థాయి ఉద్యోగం నుండి ఉన్నత స్థాయి ఉద్యోగం పొందడానికి ఉద్యోగం చేసే సేవలే గుర్తింపునిస్తాయని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కష్టంతో ఇష్టంగా ఉద్యోగ బాధ్యత నిర్వహించాలని అన్నారు. పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులు వారి జీవితాలు ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మండల అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.