calender_icon.png 1 July, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగత జలపాతంకు మాత్రమే ప్రభుత్వ అనుమతి కలదు..

30-06-2025 10:05:56 PM

ఏఎస్పీ శివం ఉపాధ్యాయ.. 

వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లాల అటవీ ప్రాంతంలో వెలసినటువంటి జలపాతాలలో వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో వెలిసిన బొగత జలపాతం(Bogatha Waterfall)కు మాత్రమే ప్రభుత్వ అనుమతి కలదని ఎటూర్ నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ(ASP Shivam Upadhyaya) సోమవారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటకులు బొగత జలపాతంకు మాత్రమే సందర్శిస్తూ లోతు తక్కువగా ఉన్న ఈత కొలనులో మాత్రమే స్నానాలు చేయాలని, అధికారుల అనుమతి లేకుండా ప్రవాహ ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి మృత్యువు బారిన పడిన సంఘటనలు గతంలో నెలకొన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో మిగతా జలపాతాలైన కొంగాల, మహితాపురం, ముత్యం దార జలపాతాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేవని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత జలపాతాలకు వెళ్లరాదని హెచ్చరించారు.