ముజీబ్ ఆధ్వర్యంలో అన్నదానం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం సుమారు 700 మంది పేద రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్ర ఫోరమ్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ముకర్రం హాజరయ్యారు.
హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కెఆర్‌రాజ్ కుమార్, కేంద్ర సంఘం క్రీడా కార్యదర్శి బోలిగిద్ద శంకర్, హైదరాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ముకీమ్ ఖురేషి, టీఎన్జీవో ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బి శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్‌ఓ మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా షరీఫ్, మహ్మద్ హబీబ్ చావుష్, మహ్మద్ హబీబ్ ముకీమ్, ఎక్సైజ్ శాఖ అధ్యక్షుడు నయీముద్దీన్ పాల్గొన్నారు.






