26 July, 2026 | 12:06 PM

జీహెచ్‌ఎంసీకి ఎలక్ట్రిక్ వాహనాలు

02-07-2025 12:37 AM

రూ. కోటి విలువ గల 10 వాహనాలు అందజేసిన ఎస్బీఐ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జులై 1 (విజయక్రాంతి):  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సామాజిక బాధ్యతగా సీఎస్‌అర్ కింద ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో జీహెఎంసీకి రూ.కోటి విలువగల 10 మహీంద్రా జియో ఎలక్ట్రిక్ వాహనాలను విరాళంగా అందించింది. మంగళవా రం కోటీలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ రాధాకృష్ణన్ జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు వాహనాలను అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎస్బీఐకి కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మరిన్నిసేవలు అందించదా నికి ఈ వాహనాలు ఎంతగానో దోహద పడుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్లు, జీహెఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, వెటర్నరీ డీడీ డాక్టర్ జెడీ విల్సన్ తదితరులు పాల్గొన్నారు.