22 April, 2026 | 4:18 PM

అమెరికాలో మన తెలుగుతేజం

02-07-2025 12:34 AM
  1. సంయుక్త రాష్ట్రాల్లో 2వ బహుమతి సాధించిన ’మహిత’ 

యువతలో ఆధ్యాత్మికత నింపుతున్న ‘ఎన్నారైవిఏ’ సంస్థ 

జగిత్యాల, జూలై 1 (విజయక్రాంతి): అమెరికాలో ఎన్నారైవిఏ అనే ఆధ్యాత్మిక సంస్థ నిర్వహించిన వ్యాస రచన పో టీలో తెలంగాణ ముద్దుబిడ్డ డోకుపర్తి మహిత 2వ బహుమతి సాధించింది. ’శ్రీరాముడు అనుసరించిన విలువలు, ఆదర్శా లు’ అనే అంశంపై అమెరికా సంయుక్త రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన పోటీలో 17 ఏళ్ల లోపు యువతీ, యువకుల వి భాగంలో కుమారి మహిత ద్వితీయ స్థానంలో నిలిచింది.

మ హిత తల్లి మాధురి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేం ద్రానికి చెందిన మంచాల జగన్ కూతురు. తండ్రి డోకుపర్తి రాజశేఖర్ ఖమ్మం జిల్లా కూర్నవల్లికి చెందిన వ్యక్తి. సాఫ్ట్వేర్ ఉద్యోగ నిమిత్తం వీరు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని ’పోర్టులాండ్’లో నివసిస్తున్నారు.

కాగా అమెరికాలో స్థిరపడ్డ కొందరు ధార్మికవేత్తలు ’మన బడి, బాల బడి’ అనే కార్యక్రమం పేరా ఎన్నారై విద్యార్థినీ విద్యార్థులకు సనాతన భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలు వీ కెండ్స్’లో నేర్పుతున్నారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పా ల్గొన్న ’మహిత’ అద్భుత ప్రతిభ కనబరిచి, అక్కడి సంస్థలు ని ర్వహించిన స్పిరుచ్యువల్ పోటీల్లో పలు బహుమతులు సా ధించింది.

’ఎన్నారై వాసవి అసోసియేషన్’ అనే సంస్థ ప్రతి ఏటా అమెరికాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు ఘ నంగా నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా వైభవంగా ఉత్సవాలు నిర్వహించింది. ’శ్రీరాముని గుణ గణాలు, ఆదర్శ జీవన విధానం’ భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఆ సంస్థ నిర్వాహకులు రమేష్ బాపనపల్లి, ప్రవీణ్ తడక మల్ల, మహేష్ జెమొల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాల స్థాయిలో పలు పోటీలను నిర్వహించారు.

ఈ నేపథ్యంలో అమెరికా స్థాయి వ్యాస రచన పో టీలో మహిత రెండవ స్థానం సాధించి శనివారం బహుమతి, ప్రశంసా పత్రం అందుకుంది. మహిత తాత మంచాల జగన్ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సభ్యునిగా పనిచేస్తూ, స్థానికంగా పలు ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో చురుకైన పాత్రపోషిస్తున్న ఆధ్యాత్మికవేత్త. అమెరికాలో పుట్టి పెరుగుతున్న ఆయన మనుమరాలు ఉన్నత బహుమతి సాధించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తం మీద మన తెలంగాణ ముద్దుబిడ్డ ’కుమారి మహిత’ అమెరికాలో విరిసిన తెలుగు తేజంగా పేరు పొందడంగర్వకారణం.