25 March, 2026 | 5:22 PM

పాఠశాలలో ఫుడ్ పేస్ట్

25-03-2026 03:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని V Kids హైస్కూల్‌లో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం వినూత్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఫుడ్ ఫెస్ట్  విద్యార్థులు కొనుగోలు చేసిన టికెట్ల ద్వారా మొత్తం రూ.15,000/- సేకరించబడింది. ఈ నిధిని ఒక మంచి కార్యానికి వినియోగించాలనే సంకల్పంతో, పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్యామ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని గణిత ఉపాధ్యాయుడు శ్యామ్ కి అందజేశారు.

ఈ నగదు మొత్తాన్ని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి శ్యామ్ కి అందించడం గొప్ప విశేషం. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పురుషోత్తం, వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.