27 March, 2026 | 2:22 PM

Breaking News

నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా.. పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు   •   శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •  

5వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్

25-03-2026 03:37 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 5వ వార్డులో పారిశుద్ధ్యం పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది రోడ్లను శుభ్రపరచడం, చెత్తను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం వంటి పారిశుధ్య పనులు నిర్వహించారు. ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకునేలా సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత,  కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.