7 July, 2026 | 8:06 PM

Breaking News

పీఆర్టీయూతోనే సమస్యలు పరిష్కారం   •   గిరిజన తండాల్లో ఘనంగా సీత్ల భవాని పండుగ వేడుకలు   •   మందకృష్ణ బాటలో పునరంకితం అవుదాం   •   ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

వంటకాలపై విద్యార్థులకు అవగాహన

07-03-2026 07:03 PM

మునిపల్లి,(విజయక్రాంతి): ఆహార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రమైన మునిపల్లి ప్రైమరీ స్కూల్ లో వంటకాలు, ఆహార అలవాట్లపై  విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం  మాధవి మాట్లాడుతూ... ఆహారోత్సవ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పౌష్టికాహారం ప్రాముఖ్యతని తెలుసుకుని జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన సంప్రదాయ వంటకాలను తీసుకోవాలని సూచించారు.

అలాగే ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ మాట్లాడుతూ... విద్యార్థులకి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి తెలియజేస్తూ మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలని పరిచయం చేయడంతో పాటు విద్యార్థులలో స్నేహ భావం పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో తెలిపారు. 

అంతకు ముందు విద్యార్థులు వివిధ రకాల సంప్రదాయ, ఆధునిక వంటకాలైన పులిహోర, దద్దోజనం, ఉప్మా, బొబ్బట్లు, పాయసం, పండ్ల సలాడ్, రవ్వలడ్లు, పోలెలు,హాల్వా,ఉప్మా, బిర్యానీ వంటి 50 రకాల వంటకాలని విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం  విద్యార్థులని  అభినందించి, వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో  పీఆర్ టీయూ ప్రధాన కార్యదర్శి సురేందర్, ఇతర ఉపాద్యాయులు మధురిమ, కవిత, అరుణకుమారి, చంద్రమౌళి, బుష్రా, ముజఫరుద్దీన్, ఉషశ్రీ, నరేష్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.