15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారుల ఆకస్మిక దాడులు

11-06-2025 12:01 AM

- దుర్వాసన వెలువడుతున్న ఆహార పదార్థాలు

- జరిమానా విధింపు

కామారెడ్డి, జూన్ 10 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు రెస్టారెంట్లు, హోటల్స్, వైష్ణవి పిండి మిల్లు లను తనిఖీలు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు వారు విస్తూపోయే విధంగా కుళ్ళిన ఆహారపదార్థాలు బయటపడ్డాయి.

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ  ఉన్నతాధికారులు  డైరెక్టర్ ఐపిఎం డాక్టర్ సి శివలీల   ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ P. రోహిత్ రెడ్డి , S. శ్రీషిక  ,పి.స్వాతి,N. జగన్నాథ్ లతో కూడిన బృందం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని పోసానిపేట గ్రామంలో గల వైష్ణవి ఫ్లోర్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో శనగ పిండిని, రాగి, జొన్నపిండి  ప్రాసెస్ చేయడం, కిటికీలకు మెష్ లేకపోవడం తయారు చేసినటువంటి పిండి బస్తాల పై ఈగలు ఉండటం,గోడలు ,పై కప్పు పై బూజుతో కూడిన దుమ్ము ధూళీలు ఉండడం,పెస్ట్ కంట్రోల్ పాటించకపోవడం, తగిన రికారడ్స్ మెయింటైన్ చేయకపోవడంతో నోటీసులు జారీ చేశారు. అలాగే సుమారు 28 లక్షల ఐదువేల రూపాయల విలువ కలిగిన 42,500 కిలోల లేబుల్, ఇతర ప్యాకింగ్ వివరాలు లేకుండా అనుమానాస్పదంగా ఉన్న శనగపప్పును  సీజ్ చేశారు.

  అనుమానిత శాంపిల్స్ సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్లో గల ల్యాబ్ కి పంపించారు.  FS  ఎస్ ఎస్ ఏ చట్టం 2006 ఉల్లంఘించినందుకు  వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం నోటీసులు జారీ చేశారు. కామారెడ్డి మండలంలో గల ఎన్ హెచ్ 44, ఎన్ హెచ్ 7 రోడ్డుపై గల పర్ణిక ప్యాలెస్, వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  వెజ్ అండ్ నాన్ వెజ్, ఉడికినవి పచ్చివి  అన్నీ ఒకే రిఫ్రిజిరేటర్లలో కలిపి ఉంచడం,  అపరిశుభ్రంగా ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లలో  నిలువ చేసిన దుర్వాసనతో కూడిన మాంసపు ఉత్పత్తులను భారీ మొత్తంలో గుర్తించడం,  ఎగ్జాస్టర్ ఫాన్స్ పై నూనెతో కూడినటువంటి నూనె, దుమ్ము ధూళితో పేరుకుపోవడం, ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ క్యాప్, హ్యాండ్ గ్లోవ్స్ ధరించకపోవడమ్,అపరిశుభ్ర  ప్రాంతంలో మూతలు తీసిన దుమ్ము ధూళి ఈగలతో కూడిన   వండిన ఆహార పదార్థాలను, అధికంగా పలుమార్లు వేడి చేసిన వంట నూనెను ఆహార పదార్థాలలో వాడుతుండడం గుర్తించారు.

పర్ణిక ప్యాలెస్ హోటల్ లో గల స్టోర్ రూమ్ నందు సుమారు 45 వేల రూపాయల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన ముడి సరుకులు, ఎక్స్పైర్ అయినటువంటి తేనె, ఫ్రూట్ పుల్ప్, పురుగులతో కూడినటువంటి బియ్యం,మిల్ మేకర్, ధనియా పొడి, ఇతర పదార్థాలను ప్రజల ఆరోగ్య నిమిత్తం హోటల్ యాజమాన్యాన్ని ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ హెడ్ వి.జ్యోతిర్మయి హెచ్చరించి అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగిందన్నారు, ఎఫ్‌ఎస్‌ఎస్ 2006 చట్టం ఉల్లంఘించినందుకుగాను వారికి నోటీసులు జారీ చేశారు.

అదేవిధంగా,NH 7 రోడ్ లో గల వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ అండ్ రెస్టారెంట్ హోటల్లో సుమారు 17వేల రూపాయల విలువగల 40 కిలోల నిల్వ ఉంచిన దుర్వాసనతో కూడినటువంటి మాంసము, 10 కిలోల గోధుమపిండి, పది కిలోల ప్రాన్స్ ను, ప్రజల ఆరోగ్యం నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేశారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. 

నిబంధనలు పాటించని, ప్రభుత్వ అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహి స్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం  హెడ్ వి.జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి, టాస్క్ ఫోర్స్  అధికారులు సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.