2 July, 2026 | 4:58 PM

Breaking News

ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •  

ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర

21-03-2026 06:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మారుమూల మండలం పెంబిలోని ఆదివాసి గిరిజనగూడాలో ఆదివాసులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ శనివారం పాదయాత్ర నిర్వహించింది. మండలంలోని ఆదివాసి గూడెం లో ఉంటున్న వారికి తాగునీరు విద్య వైద్యం రవాణా సదుపాయం కల్పించాలని వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని అటవీశాఖ అధికారులు ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహించారు. పెండి మండలంలోని యాపాలగూడ నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్ సచిన్ గౌతమ్ కృష్ణ నూతన కుమార్ తిరుపతి ధర్మన్న శంభో తదితరులు పాల్గొన్నారు.