2 May, 2026 | 7:12 AM

స్వర్గధామంలో నివాసం కోసం..

07-06-2024 12:05 AM

ఏటేటా అమెరికాకు భారతీయ విద్యార్థులు పోటెత్తుతున్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని క్రేజి అమెరికాకే దక్కింది. ఎందుకంటే, ఇక్కడ చదివి ఉద్యోగం పొందితే డాలర్ల పంటే. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి. గ్రీన్ కార్డు రావడమైతే మరీ అలస్యమైనా ఎదురుచూపులు చూస్తున్నారు. కొంత మంది కొన్నాళ్లు ఉండి తిరిగి భారత్ వస్తున్నారు. ఇక్కడ (అమెరికా) ఉన్నవాళ్ళకు ఉద్యోగం ఉంటే, వారి కుటుంబాలకు స్వర్గధా మమే. స్వదేశానికి ఎంతో కొంత డబ్బు పంపుతున్న వాళ్లూ ఉన్నారు. చాలామంది వృద్ధులను భారత్‌లో వదిలి రావడం భాధాకరమే అయినా వారికిక తప్పడం లేదు. ముఖ్యంగా భారతీయులు ఎక్కడ ఉన్నా ఆ దేశ సంపద పెంచటానికి కృషి చేస్తారు. భారత్‌లో వివిధ కారణాలతో నిపుణులు వెలుగులోకి రాలేకపోతున్నారు. మేధావులంతా విదేశాలకు తరలి పోయే పరిస్థితి వుంది.

 కనుమ ఎల్లారెడ్డి, ఆస్టిన్, అమెరికా