calender_icon.png 8 June, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపిల్లల కోసం..

11-05-2025 12:00:00 AM

పనుల హడావిడిలో పడిపోయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు ఈతరం అమ్మాయిలు. ఇటు శారీరకంగా, అటు మానసికంగా వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. పైగా ఈ వేసవిలో వీటి ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగాను.. ఉత్సాహంగా గడిపేయొచ్చు. మరి అవేంటో చూద్దాం..

పీరియడ్ సమయంలో..

నెలసరి సమయంలో చాలామంది కడుపునొప్పి, నడుం నొప్పి, ఒత్తిడి, చికాకు.. ఇలా పలు రకాల సమస్యలతో సతమతమవుతుంటారు. అలాగని నీరసపడిపోకుండా నడవడం, పరిగెత్తడం, ఆటలాడటం.. వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా ఈ నొప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. ఉత్సాహంగానూ గడిపేయొచ్చు. అలాగే ఎముకలు, వెన్నెముక, కండరాలు.. దృఢంగా మారడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి.

మచ్చలులేని చర్మానికి..

వేసవి వచ్చిందంటే చా లామంది చల్లటి జ్యూసులు, నీళ్లను తాగుతారు. అందులోనూ ముఖ్యంగా బయ టకు వెళ్లినప్పుడైతే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇవి శరీరానికి అస్సలు మంచివి కావు. కాబట్టి ఇంట్లో తయారుచేసుకునే మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఇటు ఆరోగ్యానికి.. చర్మానికి ఎంతో మంచిది.  వీటితో పాటు.. కోకమ్ షర్బత్, ఆమ్ పన్నా, బెల్ షర్బల్.. వంటివి ఎక్కువగా తాగాలి. ఇవన్నీ శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు సహాయపడతాయి. అలాగే చక్కటి పోషణనందించి మచ్చలేని చర్మాన్ని సొంతం చేస్తాయి. 

నిద్ర కూడా..

చక్కటి ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలంటే తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా కంటి నిండా నిద్రపోవాలి. ఈ క్రమంలో ఎప్పుడూ లేట్ నైట్ పార్టీలంటూ నిద్రను త్యాగం చేయకుండా రోజూ రాత్రి పూట వీలైనంత త్వరగా పడుకోవాలి. దీనివల్ల హార్మోన్ల స్థాయులు అదుపులో ఉంటాయి. అలాగే మెదడు పనితీరు మరింతంగా మెరుగుపడుతుంది. రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్ర కేటాయించడం వల్ల ఒత్తిళ్లు, ఆందోళనలకు దూరంగా ఉండవచ్చు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉండవచ్చు. బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు.