calender_icon.png 28 June, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసు మాట వినండి!

11-05-2025 12:00:00 AM

మనసు బాగోలేనప్పుడు ఏ పని పైనా దృష్టి పెట్టలేం. అలాగని రోజూ గత జ్ఞాపకాల్ని తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్లలేం. కాబట్టి ఇలాంటి ప్రతికూలతల నుంచి  బయటపడాలంటే చక్కటి దినచర్యను అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మీ పనుల్ని ప్రాధాన్యతల ప్రకారం చేసేలా ప్రణాళికలు వేసుకోవాలి. మధ్యమధ్యలో మీకిష్టమైన అలవాట్లపై దృష్టి పెట్టాలి. వారాంతాల్లో స్నేహితులతో గడిపేలా ప్లాన్ చేసుకోవాలి.

ఇక మనసును ప్రశాంతపరిచే యోగా, ధ్యానం.. వంటి అలవాట్లకు మీ జీవనశైలిలో చోటు కల్పించాలి. కాస్త కష్టమైనా ఇలా ఓ రెండు వారాలు లేదంటే ఓ నెల రోజుల పాటు కచ్చితంగా రొటీన్ ప్రకారం ఫాలో అయ్యారంటే ఎలాంటి చెడు ఆలోచనలు మీ మనసులోకి రావు.. పైగా మీరు చేసే పనులపై ఏకాగ్రత పెట్టగలుగుతారు. ఎంత ప్రయత్నించినా గతం నుంచి బయటపడలేకపోతుంటే మాత్రం.. ఓసారి మానసిక నిపుణులను సంప్రదించి మీ మనసులోని బాధను వారికి వివరించండి. వాళ్లు మీకు చక్కటి పరిష్కారం సూచిస్తారు. డిప్రెషన్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడవచ్చు.