calender_icon.png 18 December, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకెన్నాళ్లు..?

18-12-2025 12:30:37 AM

  1. గ్రామపంచాయతీ భవనాలు పూర్తయ్యేనా?

అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణాలు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

బూర్గంపాడు, డిసెంబర్17 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ భవన నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పనులు నిలిచి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.మండలంలోని కొన్ని గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు అరకొర వసతుల నడుమ ఉన్నాయి. పలు భవనాలు శిథిలావస్థలో ఉండి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

నూతన భవన నిర్మాణాలకు చర్యలు తీసుకున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో పాటు నిధుల లేమితో నిలిచిపోయాయి.నకిరిపేట, ఉప్పుసాక, కృష్ణ సాగర్ గ్రామాలకు ఐటీడీఏ ద్వారా ఒక్కో జీపీకి రూ.13 లక్షలు మంజూరు చేయగా మూడేళ్ల క్రితం భవనం పనులు చేపట్టి స్లాబ్ వేసి చేతులు దులుపుకున్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణాలు పూర్యయేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.