18 July, 2026 | 1:34 PM

Breaking News

కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్‌   •   Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

రూ.300 నగలకు.. ఆరు కోట్లు

12-06-2024 12:40 AM

అమెరికా మహిళకు జైపూర్ కిలాడీ ధోకా

న్యూఢిల్లీ, జూన్ 11: భారత్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అమెరికాకు చెందిన ఓ పర్యాటకురాలికి జైపూర్‌లోని ఓ నగల దుకాణాదారు  కేవలం రూ.300 విలువ చేసే గిల్టు నగలను ఏకంగా రూ.6 కోట్లకు అమ్మేశాడు. ఆలస్యంగా ఆ విషయం తెలుసుకొన్న సదరు మహిళ లబోదిబోమంటున్నది. చెరిష్ అనే అమెరికా మహిళ జైపూర్‌లోని జోహ్రా బజార్‌కు చెందిన ఓ దుకాణాదారు నుంచి ఆభరణాలు ఆర్డరిచ్చి చేయించుకొన్నారు.

ఇన్‌స్టా ద్వారా పరిచయమైన గౌరవ్‌సోనీ అనే దుకాణాదారు 2022 నుంచి ఆ ఆభరణాల కోసం చెరిష్ నుంచి రూ.6 కోట్లు వసూలు చేశాడు. బంగారు పూత పూ సిన వెండి నగలను కట్టబెట్టాడు. చెరిష్ వాటిని ఒక ఎగ్జిబిషన్‌లో పెట్టారు. వాటిని పరిశీలించిన నిపుణులు అవి నకిలీవని తేల్చారు. దీంతో వెంటనే ఆమె ఇండియా వచ్చి గౌరవ్‌సోనీని నిలదీశారు. గౌరవ్‌సోనీ డబ్బులు ఇవ్వకపోయే సరికి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. తనకు న్యాయం చేయాలని ఢిల్లీలోని అమెరి కా రాయబార కార్యాలయాన్ని కోరా రు. దర్యాప్తు జరిపి చెరిష్‌కు న్యాయం చేయాలని జైపూర్ పోలీసులను అమెరికా ఎంబసీ కోరింది.