హైడ్రా మాకు కావాలి..
హైదరాబాద్‌లో హైడ్రా పేరిట సాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జనం స్వాగతిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాల సంగతేంటని సర్కారును ప్రశ్నిస్తున్నారు. హైదారాబాద్‌ను మాత్రమే అక్రమ నిర్మాణాలు లేని నగరంగా తీర్చిదిద్దుతారా? వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, గోదావరిఖనితో పాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలు సహా ముఖ్యమైన ప్రాంతాలపై దృష్టి పెట్టాలనేది జనం కోరి క. దీనిపై ఇప్పటికే జనం నుంచి సర్కారుకు వినతులు వస్తున్నాయి. కానీ మేం హైదరాబాద్‌లో మాత్రమే అన్నట్లుగా రేవంత్ సర్కారు పేర్కొంటోంది.
తెలంగాణ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే హైదరాబాద్‌లో మాత్రమే అక్రమాలు జరుగాతా యా...? జిల్లాల్లో జరగవా? అని జనం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైడ్రా కొందరినే టార్గెట్ చేసిందని, రాజకీయంగా సర్కారుకు ఇబ్బంది అయ్యే కూల్చివేతలపై హైడ్రా దృష్టి సారించడం లేదని కూడా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఒవైసీ కాలేజీల ఘటనను బీజేపీ ఉదహరిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా చర్యలు ఏ విధంగా ఉంటాయనేదానిపై జనంలో ఆసక్తి నెలకొంది. మరోవైపు మిగతా కార్పొరేషన్లు, జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థలు కావాలన్న జనం కోరికను రేవంత్ సర్కారు ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.






