5 June, 2026 | 3:19 AM

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

05-06-2026 01:18 AM

నిర్మల్, జూన్ 4 (విజయ క్రాంతి) : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని నిర్మల్ డిఎఫ్ ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబుడే అన్నారు. ప్రజా పాలన  ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా అటవీ కార్యాలయంలో Reduce Waste  Protect Nature అంశంపై వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రకృతిని కాపాడడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిని భాను, రామకృష్ణారావు, నజీర్ ఖాన్, సంతోష్ (సారంగాపూర్ & నిర్మల్), వెన్నెల, సుజాత పాల్గొన్నారు.