27 July, 2026 | 9:19 PM

తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఆకారపు జయమ్మ ఎన్నిక

27-07-2026 08:37 PM

నూతనకల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మండల పరిధిలోని ది ర్శన పల్లి  గ్రామానికి చెందిన ఆకారపు జయమ్మను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జానపద కళాకారుల సంక్షేమం, మహిళా కళాకారుల సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం కోసం  సమర్థవంతంగా పనిచేస్తా నని ఆమె తెలిపారు.