హోటళ్లలో అక్రమ కలప నిల్వలపై అటవీశాఖ తనిఖీలు

28-09-2026 | 08:14pm

జిల్లా ఫారెస్ట్ అధికారి సునీత ఆధ్వర్యంలో పలు హోటళ్లలో తనిఖీలు

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా కలప నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సునీత(District Forest Officer Sunitha) ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో(Hotels) కలప నిల్వలు, వాటికి సంబంధించిన అనుమతులు, ఇతర వివరాలను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో కలప నిల్వలకు సంబంధించి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీశారు. అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ చేసినట్లు గుర్తిస్తే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారీ హబీబ్, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు