విజయ క్రాంతి వార్తకు స్పందన
పుణ్య నాయక్ తండ గ్రామాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారులు
బోథ్,(విజయక్రాంతి)ఫ సోనాల మండలంలోని పుణ్యానాయక్ తాండ గ్రామంలో అటవీ శాఖ భూమిలో పశువుల పాకల నిర్మాణం వార్తకు అటవీశాఖ సిబ్బంది స్పందించారు. పుణ్యా నాయక్ తండ గ్రామానికి వెళ్లి పశువుల పాకలను నిర్మిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. పశువుల పాకలు నిర్మిస్తున్న స్థలంపై భాగంలో అటవీ శాఖకు చెందిన భూమి ఉందని అయితే ఎవరు కూడా ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని పార్టీబి సోనాల గ్రామాల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రాదేశం సంధ్యారాణిలు గ్రామస్తులకు సూచించారు. అటవీ భూముల్లో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి వివాదాలు లేకుండా నిర్మాణాలు చేసుకోవాలని గ్రామంలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని పశువుల పాకల యజమానులకు సూచించారు. ఏ ఒక్క చెట్టుకు నష్టం సంభవించిన కేసులు తప్పవని హెచ్చరించారు.






