20 April, 2026 | 2:35 AM

గ్రామాల అభివృద్ధికి అటవీశాఖ కృషి

20-04-2026 12:34 AM

బెజ్జూర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మారుమూల గ్రామాల ప్రజల అభివృద్ధి కోసం అటవీ శాఖ కృషి చేస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాల్లో ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను డీఎఫ్‌ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అగరగూడ, గుండెపల్లి, ఇందిర్గాం, డబ్బా, హుడ్కిలి గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లు, ఎలక్ట్రిక్ ఇండక్షన్ పొయ్యిలు పంపిణీ చేయడంతో పాటు సోలార్ హైమాస్ట్ లైట్లు, చేతి పంపులు ప్రారంభించారు. అనంతరం పునరుద్ధరించిన సిర్పూర్ రేంజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్, ఎఫ్డీఓ అప్పయ్య, ఎఫ్‌ఆర్‌ఓలు అనిల్ కుమార్, శ్రావణ్, ముసవీర్, ప్రవీణ్ కుమార్, డీఆర్‌ఓ శశిధర్ బాబు, ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, సర్పంచులు వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్, అల్లూరి రాజేశ్వరి రాజు, కోండ్ర సులోచన తదితరులు పాల్గొన్నారు.