calender_icon.png 9 May, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌పై వేటు

19-03-2025 12:44:11 AM

జూలపల్లి అటవీ ఘటనపై విచారణ చేసి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డిఎఫ్ సత్యనారాయణ 

మహబూబ్ నగర్ మార్చి 18 (విజయ క్రాంతి) : అడవి ప్రాంతంలో చదును చేసి నూతనంగా మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించిన ఉన్నత అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న వృక్షాలను సైతం ఇతరులకు బేరం కుదుర్చుకుని విక్రయించారని విజయక్రాంతి దినపత్రిక లో ”చెప్పేదొకటి చేసేది మరొకటి’ ’అధికారులకు ఒక న్యాయం సామాన్యులకు మరో న్యాయమా’ అంటూ మహమ్మదాబాద్ మండలం జూలపల్లి అటవీ జరిగిన సంఘటనపై విజయ క్రాంతి దినపత్రిక ప్రత్యేక కథనాలను రాసిన విషయం విధితమే.

ఈ విషయంపై డీఎఫ్‌ఓ సత్యనారాయణ విచారణ చేసి బాధ్యులైన జూలపల్లి  ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరసింహులు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై డిఎఫ్‌ఓ సత్యనారాయణ మాట్లాడుతూ అటవీ ప్రాంతాలలో ఎవరైనా వృక్షాలను నరికి తరలింపులకు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ విషయంపై అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కూడా వృక్షాలను కొట్టివేయకూడదని, ఎక్కడైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.