4 March, 2026 | 12:03 PM

ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

04-03-2026 10:39 AM

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తతల మధ్య మంత్రి వివేక్ వెంకట్ స్వామి(Minister Vivek Venkataswamy) కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించి విధ్వంసం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Former MLA Balka Suman) జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఘటనలో బాల్క సుమన్, పలువురు పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు.

కోర్టు గతంలో ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయనను ఆదిలాబాద్ జిల్లా జైలులో(Adilabad District Jail) ఉంచారు. బాల్క సుమన్ బుధవారం విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆదిలాబాద్ జైలు వద్దకు చేరుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొంటామని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.