28 August, 2026 | 1:55 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు

06-07-2026 02:36 AM

ఏరీస్ ఆగ్రో అకడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్‌షిప్స్ 

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): వ్యవసాయం, ఆక్వాకల్చర్, వ్యవసాయ పరికరాల రంగంలోని ప్రముఖ సంస్థ ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ హైదరాబాద్‌లోని టీఎస్సీఏబీ ఆడిటోరియంలో నిర్వహించిన ఏరీస్ ఫ్యూచురా దక్షిణ భారత సేల్స్, మార్కెటింగ్ అండ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ లీడర్షిప్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా ముగించింది. కార్యక్రమానికి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ మీర్చందానీ, మేనేజర్ అర్మాన్ మీర్చందానీ, డైరెక్టర్ మార్కెటింగ్ (దక్షిణ భా రతదేశం) జె.పీ. సుబ్రహ్మణ్యం హాజరై ప్రతిభ కనబరిచిన వారి కి అవార్డులు ప్రదానం చేశారు.

ఏపీ, తెలంగాణకు చెందిన ఎనిమిది మంది వి ద్యార్థులకు మొత్తం రూ.47, 500 విలువైన అకడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్లను అందజేశారు. స్కాలర్షిప్ పొందిన వారిలో కొత్త ప్రణీత్, బత్తుల శివ కుమార్, గుండా కీర్తన, మోహన్ సత్య వెంకట్, కొత్త సాత్విక్, అబ్దుల్ సత్తార్, మాచా స్వర్ణ దీపిక, మిరియాల ఉదయశ్రీ ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ మీర్చందానీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విద్యా ప్రతిభను ప్రోత్సహించడం సంస్థ బాధ్యతగా భావిస్తున్నామని, ఏరీస్ ఫ్యూచురా ద్వారా ఉద్యోగుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు సమాజాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.