16 July, 2026 | 2:22 PM

పోలీసులు కొట్టారని డీసీపీకి ఫిర్యాదు

06-06-2024 04:06 PM

జనగామ: జనగామ పోలీసులు తమ ఇద్దరు కుమారులను అకారణంగా పోలీస్ స్టేషన్ లో ఉంచి విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ దేవరాయి ఎల్లయ్య గురువారం డీసీపీ సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన తమ్ముడు, ప్రస్తుత కౌన్సిలర్ దేవరాయి నాగరాజుపై ఇటీవల ఓ కేసు నమోదైందని తెలిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా.. పోలీసుల నిత్యం ఇంటికి వచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం తన కుమారుడితో పాటు తమ్ముడి కుమారుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని, చేతులు కాళ్లు లేవకుండా విచక్షణా రహితంగా కొట్టారని వాపోయారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు.