16 July, 2026 | 2:39 PM

రాజన్నను దర్శించుకున్న ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్

06-06-2024 03:46 PM

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కార్పోరేట్ సెంటర్) చీఫ్ జనరల్ మేనేజర్ మంజు శర్మ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో కోడె మొక్కుచెల్లించుకొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి స్వామి వారి  ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.