calender_icon.png 15 February, 2026 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ హబ్‌లో పూర్వ సీపీలకు సన్మానం

14-02-2026 12:00:00 AM

సైబరాబాద్ పోలీస్ 23 ఏళ్ల ప్రస్థానం అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేక గుర్తింపు

శేరిలింగంపల్లి, పిబ్రవరి 13 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ సేవల 23 ఏళ్లు ఆధునిక పోలీసింగ్కు ప్రతీకగా ఎదిగిన కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం టీ-హబ్లో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీజీపీ శివధర్ రెడ్డి హాజరుకాగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్‌తో పాటు మాజీ కమిషనర్లు, సీనియర్ రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. మా జీ డీజీపీ డా. ఎం. మహేందర్‌రెడ్డి, ఎస్. ప్ర భాకర్‌రెడ్డి, ద్వారకా తిరుమలరావు, స్పెషల్ హోం సెక్రటరీ సీవీ ఆనంద్, వీ. నవీన్ చంద్ర, సందీప్ శాండిల్యాలు కమిషనరేట్ అభివృద్ధి ప్రయాణాన్ని స్మరించుకున్నారు.